ఉప్పుటూరులో ఉత్సాహంగా ఎడ్ల బల ప్రదర్శన పోటీలు

83చూసినవారు
పర్చూరు మండలం ఉప్పుటూరులో రాష్ట్ర స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు శనివారం జోరుగా జరిగాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ చెన్నకేశవ స్వామి వార్ల తిరుణాల సందర్భంగా గ్రామంలో రాష్ట్ర స్థాయి పోలురాధ ఎడ్ల బల ప్రదర్శన పోటీలు నిర్వహిస్తున్నారు. ఇసుక బస్తాలతో కూడిన చక్రాలు తిరగని ఎడ్ల బండిని పది నిమిషాల్లో ఎక్కువ దూరం లాగిన ఎడ్ల జతను విజేతగా ప్రకటిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఆదివారంతో ఈ పోటీలు ముగుస్తాయి.

సంబంధిత పోస్ట్