దేశవ్యాప్తంగా అమలవుతున్న ఒకే జిల్లా ఒకే ఉత్పత్తి అనే కార్యక్రమం కారణంగా చీరాల సిల్క్ సారీస్ ఉప్పాడ వస్త్రాలకు మహర్దశ పట్టింది. జాతీయ స్థాయిలో చీరాల చీరలను ఈ కార్యక్రమానికి ఎంపిక చేసే ప్రక్రియలో భాగంగా ఇద్దరు సభ్యుల కేంద్ర బృందం గురువారం సాయంత్రం ఈపూరుపాలెం, జాండ్రపేటలలోని చేనేత వస్త్రాల తయారీ కేంద్రాలను సందర్శించింది. పట్టు వస్త్రాల నాణ్యతను కేంద్ర బృందం సభ్యులు ఇష్షుదీప్, డాక్టర్ దివ్య పరిశీలించారు.