నాసా స్పేస్ సొసైటీ, నాసా రీసెర్చ్ కేంద్రం సంయుక్తంగా నిర్వహించే సెటిల్మెంట్ కంటెస్టు ప్రాజెక్ట్ (2024- 25) డిజైన్ చేసేందుకు అర్హత సాధించిన చీరాల శ్రీచైతన్య పాఠశాల విద్యార్థులకు శుక్రవారం నాసా కిట్ల పంపిణీ జరిగింది. పాఠశాల ఆవరణలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పవని భాను చంద్ర మూర్తి వీటిని అందజేశారు. చైతన్య పాఠశాలలో 6-9 అభ్యసిస్తున్న 27 మంది అర్హత సాధించారని ప్రిన్సిపల్ హరిబాబు తెలిపారు.