సుదీర్ఘకాలం చీరాల పట్టణ టిడిపి అధ్యక్షులుగా పనిచేసి మధ్యలో కొంతకాలం వైసీపీ వైపు వెళ్లిన గుంటూరు మాధవరావు బుధవారం తిరిగి స్వగృహానికి చేరుకున్నారు. చీరాల ఎమ్మెల్యే కొండయ్య సమక్షంలో ఆయన బుధవారం టిడిపిలో చేరారు. పార్టీ కండువా కప్పి మాధవరావుకి ఎమ్మెల్యే మాలకొండయ్య సాదర స్వాగతం పలికారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, అనుభవానికి తగ్గట్టు మాధవరావుకు పార్టీలో తగిన ప్రాధాన్యం ఇస్తామని ఎమ్మెల్యే చెప్పారు.