చీరాలలోని టిడిపి పార్టీ కార్యాలయం నందు శుక్రవారం నియోజకవర్గస్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దులూరి మాల కొండయ్య పాల్గొని మాట్లాడారు. పండగ వాతావరణంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరగాలని అన్నారు. సభ్యత్వం టిడిపి కార్యకర్తలకు బాసటగా నిలుస్తుందని అన్నారు. ఆపద సమయంలో వారి కుటుంబాలకు అండగా ఉంటుందని ఎమ్మెల్యే కొండయ్య తెలిపారు.