ఈ ఏడాది జూన్ నెలలో చీరాల మండలం ఈపూరుపాలెంలో హత్యాచారానికి గురైన మహిళ కుటుంబానికి వైసీపీ శనివారం 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. పార్టీ అధినేత జగన్ ఆదేశాల మేరకు బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడు మేరుగ నాగార్జున, చీరాల పార్టీ ఇంచార్జ్ కరణం వెంకటేష్ తదితరులు ఆ బాధితురాలి కుటుంబీకులను కలిసి చెక్కు అందజేశారు. భవిష్యత్తులో కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటామని వారు భరోసా ఇచ్చారు.