చీరాలలో తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయం నందు శుక్రవారం ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ జనార్దన్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 153 అర్జీలు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. వాటిలో 35 పెన్షన్ అర్జీలు, 105 ఇళ్ల స్థలాల అర్జీలు, 13 ఇతర సమస్యల అర్జీలు వచ్చినట్లు జనార్ధన్ తెలియజేశారు.