చీరాల మండలం వాడరేవు గ్రామానికి చెందిన 50 కుటుంబాలు వైసిపి పార్టీని వీడి ఆదివారం రాత్రి ఎమ్మెల్యే మాలకొండయ్య సమక్షంలో టిడిపి పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి టిడిపి కండువా కప్పారు. చంద్రబాబు నాయుడు పరిపాలన నచ్చి ప్రజలందరూ టిడిపి పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే చెప్పారు.