చీరాల మండలం ఈపురుపాలెం పంచాయతీ పరిధిలోని ఆదినారాయణపురం వద్ద వల్లాగి నాగరాజు అనే వ్యక్తి అక్రమంగా మద్యం అమ్ముతున్నాడని సమాచారంతో మంగళవారం ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. అతని వద్ద నుంచి ఆరు లీటర్లు నాటు సారా ని స్వాధీనం చేసుకున్నారు. రాబడిన సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్లు పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసినట్లు తెలిపారు.