యలమంచిలి గ్రూప్ ఆఫ్ డెవలప్మెంట్ పౌండేషన్ నిర్వహిస్తున్న వి. ఆర్. ఎస్. & వై. ఆర్. ఎన్. ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థుల ప్రతిభను గౌరవిస్తూ అకడమిక్ ఎక్సలెన్స్ అవార్డులు అందజేశారు. తల్లిదండ్రుల సమక్షంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు శనివారం పాల్గొన్నారు. కళాశాల అకడమిక్ డైరెక్టర్ మరియు ప్రిన్సిపల్ పొగడదండ రవికుమార్ మాట్లాడుతూ విద్యార్థులు కొత్త విషయాలను నేర్చుకుంటూ విద్యార్థులు అభివృద్ధి చెందాలని అన్నారు.