ఈపురుపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో బైపాస్ రహదారిపై 2018లో చీరాలలోని ఎన్టీఆర్ నగర్ కు చెందిన వినోద్ కుమార్ ను లైసెన్స్ లేకుండా ఆటో నడుపుతూ ఢీ కొట్టి అతని మృతికి కారణమైన సునీల్ కుమార్, శరత్ కుమార్ లకు న్యాయస్థానం శిక్ష విధించినట్లు ఎస్సై చంద్రశేఖర్ మంగళవారం తెలిపారు. సునీల్ కుమార్ కు రెండేళ్లు జైలు శిక్ష, 2, 500 రూపాయలు జరిమానా, శరత్ కుమార్ కు వెయ్యి రూపాయలు జరిమానా విధించారని అన్నారు.