చీరాల నియోజకవర్గంలో సోమవారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ 134 జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక గడియారం సెంటర్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి వైసిపి సమన్వయకర్త కరణం వెంకటేష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ అంబేద్కర్ కు మరణం లేదని ఆయన కొందరివాడు కాదు అందరివాడు అని అన్నారు. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలని వెంకటేష్ చెప్పారు.