సముద్రంలో స్నానం చేస్తూ అలల ఉధృతికి కొట్టుకుపోతున్న కాపాడిన ఘటన సూర్యలంక సముద్రతీరంలో ఆదివారం జరిగింది. గుంటూరుకు చెందిన ఉదయ్ రాజు స్నేహితులతో కలిసి సూర్యలంక బీచ్ కు వచ్చాడు. వారు సముద్రంలో స్నానం చేస్తుండగా కెరటాల ఉధృతికి ఉదయ్ రాజు కొట్టుకుపోయాడు. దీన్ని గమనించిన గజ ఈతగాళ్లు వెంటనే సముద్రంలోకి వెళ్లి ఉదయరాజును కాపాడి ఒడ్డుకు తీసుకువచ్చారు. నిండు ప్రాణాలు నిలిపిన గజ ఈతగాళ్లను అందరూ అభినందించారు.