డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని సోమవారం చీరాల మెప్మా పరిధిలోగల 138 ఎస్సీ, ఎస్టీ బిసి మహిళా డ్వాక్రా గ్రూపులకు ఎమ్మెల్యే కొండయ్య నాలుగు కోట్ల నలభై లక్షల రూపాయలు విలువచేసే రుణాలను అందజేశారు. వీటిని సద్వినియోగం చేసుకొని మహిళలు సొంత కాళ్లపై నిలదొక్కుకోవాలని ఆయన కోరారు. చంద్రబాబు ప్రభుత్వం మహిళా సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. యువ నేతలు అమర్నాథ్, మహేంద్రనాథ్ కూడా పాల్గొన్నారు.