రోడ్డు ప్రమాదంలో మరణించిన ఏ. ఆర్ ఏ. ఎస్. ఐ సంపూర్ణరావు కుటుంబీకులు, స్థానికులు శుక్రవారం రాత్రి పేరాలలో నడిరోడ్డుపై ఆందోళనకు దిగారు. ఈ ప్రమాదానికి కారకుడైన దొనకొండ ఎస్సై విజయ్ కుమార్ పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చి, ఆయనను తక్షణం అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. సొంత కారును రాంగ్ రూట్లో నడుపుతూ సంపూర్ణరావు ప్రాణాలను విజయకుమార్ బలిగొంటే అతడిని రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.