చీరాల ఆర్టీసీ బస్టాండ్‌ను శనివారం జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి సందర్శించారు. అక్కడి టాయిలెట్స్, కార్గో సెంటర్, ఫుడ్ స్టాల్స్‌ను తనిఖీ చేశారు. ప్రయాణికులతో మాట్లాడి బస్టాండ్ సౌకర్యాలపై ఆరా తీశారు. ఆగస్టు 15 నుంచి అమలయ్యే మహిళల ఉచిత బస్సు పథకం నేపథ్యంలో, కొత్త బస్సులు, స్టాప్‌ల కొరత తదితర ఏర్పాట్లను పరిశీలించామని తెలిపారు.