చీరాల రూరల్ ప్రాంతాల్లో గ్రామ శివార్లలో నిర్వహిస్తున్న పలు పేకాట శిబిరాలపై ట్రైని డీఎస్పీ అభిషేక్ ఆధ్వర్యంలో ఈపూరుపాలెం పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా బోయినవారిపాలెంలో ఉన్న వాడ పొలాలలో పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 42,480 రూపాయలు నగదును సీజ్ చేయడం జరిగిందని ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు.