చీరాల ఎక్సైజ్ సిఐ పేరం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆయన సిబ్బంది శనివారం విస్తృతంగా జరిపిన దాడుల్లో అక్కాయపాలెంలో ప్రభుత్వ అనుమతికి మించి అధికంగా మద్యం సీసాలు కలిగిన ఒక వ్యక్తి పట్టుబడ్డాడు. అతడి వద్ద నుండి 11 మద్యం సీసాలు స్వాధీన పరుచుకున్నారు. అలాగే ఆదినారాయణపురంలో ఎక్సైజ్ పోలీసులు మరో వ్యక్తిని పట్టుకుని నాలుగు లీటర్ల నాటు సారా స్వాధీన పరుచుకున్నారు.కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.