వేటపాలెం మండలం దేశాయిపేట పంచాయతీ గ్రామస్తులు 500 మంది ఆదివారం తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో వారికి తగిన ప్రాధాన్యం ఇస్తానన్నారు. టిడిపి అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్రనాధ్ మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం మాత్రమే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చగలదని చెప్పారు. ఎవరికి ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామన్నారు.