చీరాలలోని గడియారం స్తంభం వద్ద బుధవారం రాత్రి సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో చీరాల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య పాల్గొని సెమీ క్రిస్మస్ కేకును కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాను ప్రభు ఏసుక్రీస్తు మార్గంలో నడిచి ప్రజలకు సేవలు అందిస్తానని చెప్పారు. తమ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నారని తెలిపారు.