చీరాల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య శనివారం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా వేద పండితులు వారిని సాదరంగా ఆహ్వానించి సత్కరించారు. పూజలు జరిపి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నియోజకవర్గంలోని ప్రజలందరూ కూటమి ప్రభుత్వం పాలనలో సంతోషంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే కొండయ్య తెలియజేశారు.