చీరాల మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావు పై మాజీ ఎమ్మెల్యే ఆమంచి వర్గం కౌన్సిలర్ల మద్దతుతో ఎమ్మెల్యే కొండయ్య ఆధ్వర్యంలో టిడిపి కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం బుధవారం నెగ్గింది. అవిశ్వాసానికి అనుకూలంగా 26 ఓట్లు వచ్చాయి. కౌన్సిలర్లతోపాటు ఎక్స్ అఫిసియో సభ్యుల హోదాలోఎమ్మెల్యే కొండయ్య, ఎంపీ తేనేటి కృష్ణ ప్రసాద్ కూడా ఓట్లు వేశారు. తీర్మానం నెగ్గడానికి అవసరమైన దానికంటే 3ఓట్లు అదనంగా వచ్చాయి.