ఈనెల 14వ తేదీన పిఠాపురంలో జరగనున్న జనసేన ఆవిర్భావ వేడుకలకు బాపట్ల పరిసర ప్రాంతాల నుంచి జనసేన కార్యకర్తలు తరలిరావాలని చీరాల నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త ఆమంచి స్వాములు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బుధవారం రోటరీ కమ్యూనిటీ హలులో నిర్వహించిన సన్నాహ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా గొంతుకై నిలిచేందుకు 12 ఏళ్ల కిందట ఆవిర్భవించిన జనసేన పార్టీ 2024 ఎన్నికల్లో 100% విజయం సాధించిందని చెప్పారు.