ఈపూరుపాలెం వై జంక్షన్ లో శుక్రవారం ఉదయం ఏ. ఆర్ ఎస్సై మేడిద సంపూర్ణరావు బైకును ఢీకొన్న కారుపై పోలీసు స్టిక్కర్ ఉండడంతో ఆ కోణంలో నుండి దర్యాప్తు సాగుతోంది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఆ కారులోని వారు పరారయ్యారు. అది నిజంగానే పోలీసుల వాహనమా లేక ఎవరైనా పోలీస్ స్టిక్కర్ వేసుకుని ఆ కారుని నడుపుతున్నారా అందులో ఉన్న వారెవరు తదితర అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో సంపూర్ణరావు మృతి చెందారు.