ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటి పిలుపు మేరకు చీరాల డిపో వద్ద ఎంప్లాయీస్ యూనియన్ అధ్వర్యంలో చేపట్టిన సమ్మె రెండో రోజుకు చేరింది. అర్హులైన ఉద్యోగులందరికీ పదోన్నతుల కోసం అనుమతులను వెంటనే ఇవ్వాలని, అదేవిధంగా ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీ ద్వారా నిర్వహించాలని శనివారం డిమాండ్ చేశారు. వెంకట్రావు, శ్రీనివాసరావు, రవి, సునీత, సుజాత, పుష్పవల్లి, ద్రాక్షావల్లి, కుసుమ కుమారి తదితరులు పాల్గొన్నారు.