చీరాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైస్కూల్ విద్యార్థులకు 27వేలు రూపాయలు విలువగల 300 భోజన స్టీల్ ప్లేట్లను అందజేశారు. హెచ్ ఎం సాల్మన్ మాట్లాడుతూ స్టీల్ ప్లేట్లు లేవని గుర్తించిన వెంటనే వాకర్స్ సభ్యులు ముందుకు రావడం గొప్ప విషయమన్నారు. వాకర్స్ క్లబ్ ద్వారా ఆరుపదుల వయసులో అందిస్తున్న సేవలు ఆదర్శమని చెప్పారు. పోలుదాసు రామకృష్ణ, చారగుళ్ళ గురుప్రసాద్, నారాయణమూర్తి, పాల్గొన్నారు.