వైసీపీకి చెందిన చీరాల మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావు పై అవిశ్వాస పెట్టేందుకు అవసరమైన బలం సమకూరినప్పటికీ సదరు నోటీసును కలెక్టర్ కి ఇవ్వడంలో జాప్యం జరుగుతుండడం పై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టిడిపి ఎమ్మెల్యే కొండయ్య వర్గీయులు 16మంది, మాజీ ఎమ్మెల్యే ఆమంచి వర్గీయులు ఐదుగురు మొత్తం 21 మంది కౌన్సిలర్లు ఈ నోటీసుపై సంతకాలు చేశారు. అయినప్పటికీ ఎమ్మెల్యే కొండయ్య ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని సమాచారం.