పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చీరాల డీఎల్పీ ఓ శివన్నారాయణ అన్నారు. బుధవారం వేటపాలెం మండలం కొత్తపేట గ్రామపంచాయతీ ఎస్ డబ్ల్యూపీసీ షెడ్ లో జరిగిన శిక్షణ తరగతులలో ఆయన మాట్లాడారు. చీరాల, వేటపాలెం, చిన్నగంజాం మండలాల పారిశుద్య సిబ్బందికి, పంచాయతీ కార్యదర్శులకు చెత్త నుండి సంపద తయారీ ఎలా చేయాలన్న అంశం పై శిక్షణా తరగతులు ఏర్పాటు చేసినట్లు డీఎల్పీవో తెలిపారు.