అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి చేస్తానని చీరాల ఎమ్మెల్యే కొండయ్య చెప్పారు. చీరాల నియోజకవర్గంలో అధికంగా ఉన్న బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం కొండయ్య ఊరేగింపుగా వచ్చి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. టిడిపి కూటమి ప్రభుత్వం అంబేద్కర్ బాటలో నడుస్తుందన్నారు. టిడిపి యువ నేతలు మహేంద్ర నాధ్, అమర్నాథ్ కూడా పాల్గొన్నారు.