చీరాల: కుక్కను ఢీకొని నిలిచిపోయిన వందే భారత్

6చూసినవారు
చీరాల: కుక్కను ఢీకొని నిలిచిపోయిన వందే భారత్
విజయవాడ నుండి చెన్నై వెళుతున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఆదివారం చీరాలలో ఒక కుక్కను ఢీకొనడంతో దాదాపు అరగంట పాటు ఆగిపోయింది. అతివేగంగా వెళుతున్న ఈ ఎక్స్ప్రెస్ కింద కుక్క పడడంతో దాని కళేబరం ఇంజన్లో చిక్కుకుపోయి రైలు మొరాయించింది. విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది అక్కడికి చేరుకొని కుక్క కళేబరాన్ని ఇంజన్ నుండి తొలగించడంతో రైలు యధావిధిగా సాగిపోయింది.

సంబంధిత పోస్ట్