పిడుగుపాటుకు కొబ్బరి చెట్టు దగ్ధం

74చూసినవారు
పిడుగుపాటుకు కొబ్బరి చెట్టు దగ్ధం
యద్దనపూడి మండలం పోలూరు గ్రామంలో బుధవారం పిడుగుపడి ఒక కొబ్బరి చెట్టు దగ్ధమైంది. పిడుగు పడటంతో కొబ్బరి చెట్టుపై ఒక్కసారిగా మంటలు వ్యాపించి పూర్తిగా కాలిపోయింది. చెట్టు గ్రామం మధ్యలో ఉన్నా ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. చెట్టు ప్రక్కన ఉన్న వరి గడ్డి కూడ కొంత భాగం కాలిపోయింది. వెంటనే అక్కడికి చేరుకున్న గ్రామస్థులు మంటలను ఆర్పివేశారు.

సంబంధిత పోస్ట్