జిల్లాలో పర్యటన నిమిత్తం రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ శుక్రవారం సాయంత్రం చీరాల మండలం వాడరేవుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకట మురళి, ఎస్పీ తుషార్ డూడీ, చీరాల ఆర్డీవో చంద్రశేఖర నాయుడు ఆయనకు పుష్పగుచ్చాలిచ్చి స్వాగతం పలికారు. జిల్లాకు సంబంధించిన విషయాలపై గవర్నర్ వారితో కాసేపు మాట్లాడారు. పాలన పారదర్శకంగా, ప్రజాహితంగా ఉండేలా చూసుకోవాలని గవర్నర్ నజీర్ అధికార యంత్రాగానికి సూచించారు.