దాచేపల్లి: ఘనంగా బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

71చూసినవారు
దాచేపల్లి: ఘనంగా బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు
దాచేపల్లి పట్టణంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీటీడీ సభ్యుడు జంగా కృష్ణమూర్తి పాల్గొన్నారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం రాసి, మనందరం ఒకటేనని చాటి చెప్పిన ఏకైక వ్యక్తి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్