వడదెబ్బతో ఉపాధి హామీ కూలీ మరణించిన ఘటన కారంచేడులో చోటుచేసుకుంది. చెరుకూరి ఆదినారాయణ అనే వ్యక్తి మంగళవారం ఉపాధి హామీ పనులకి వెళ్లారు. పని ముగించుకొని ఇంటికి వచ్చే క్రమంలో స్పృహ తప్పి పడిపోయాడు. గమనించిన స్థానికులు ఆదినారాయణ ను ఇంటికి తీసుకువెళ్లారు. అనంతరం స్థానిక వైద్యుడిని పిలిపించగా అప్పటికే వడ దెబ్బతో మృతి చెందినట్లు నిర్ధారించారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు