సూపర్ సిక్స్ పథకాల అమలకు ప్రభుత్వం కృషి

75చూసినవారు
సూపర్ సిక్స్ పథకాల అమలకు ప్రభుత్వం కృషి
సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసేలా ప్రభుత్వం కృషి చేస్తుందని పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ అన్నారు. శనివారం నియోజకవర్గంలోని లింగాపురం, ఉంగుటూరు గ్రామాలలో మన మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు నియోజకవర్గంలో చేసిన పనులు రాబోవు రోజుల్లో చేయనున్న పనులపై శ్వేత పత్రాన్ని విడుదల చేస్తామన్నారు. ఆయన వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్