ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని దెబ్బ కొట్టాలనుకున్నవారు చరిత్రహీనులవుతారని అనేకమార్లు రుజువైందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. ఇంకొల్లు మండలం భీమవరం గ్రామంలో సోమవారం ఆయన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదల సంక్షేమానికి పునాది వేసింది ఎన్టీఆర్ అయితే దాన్ని కొనసాగిస్తున్నది చంద్రబాబు అని చెప్పారు.