చీరాల మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం బుధవారం టిడిపి అధినేత సీఎం చంద్రబాబుని మర్యాదపూర్వకంగా కలిశారు. వారిద్దరూ నవ్వుకుంటూ మాట్లాడుకున్నారు. టిడిపికి పాత కాపు అయిన బలరాం 2019లో చీరాల నుండి గెలుపొందిన అనంతరం వైసీపీకి జై కొట్టారు. ఆయన కుమారుడు కరణం వెంకటేష్ 2024 ఎన్నికలలో చీరాల నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో బలరాం భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.