చీరాల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యునికి మెమో జారీ

73చూసినవారు
చీరాల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యునికి మెమో జారీ
అనారోగ్యంతో చికిత్సకై చీరాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన వృద్ధురాలి పట్ల అనుచితంగా ప్రవర్తించాడనే ఫిర్యాదు మేరకు డాక్టర్ పృధ్వీ అనే వైద్యునికి వైద్య సర్వీసుల జిల్లా కోఆర్డినేటర్ బుధవారం మెమో జారీ చేశారు. రెండు రోజుల్లో తగిన వివరణ ఇవ్వాలని ఆయన ఆదేశించారు. తాను చెప్పిన చోట వైద్య పరీక్షలు చేయించుకోలేదని, మందులు కొనలేదని డాక్టర్ పృథ్వి తనను ఆసుపత్రి నుండి పంపేశాడని బాధితురాలు కలెక్టరు కి ఫిర్యాదు చేసింది.

సంబంధిత పోస్ట్