దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పరుచూరు టిడిపి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు శుక్రవారం ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ శాఖల జిల్లా అధికారులను కూడా ఈ కార్యక్రమానికి రప్పించి ప్రజల సమస్యలను నేరుగా వారి దృష్టికి ఎమ్మెల్యే తీసుకువెళ్లారు పలు గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ అర్జీలను ఎమ్మెల్యేకు స్వయంగా అందజేశారు.