చీరాలలో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు ఏ దశలో ఉందని ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య మంగళవారం అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ లో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎప్పటినుండో ఇక్కడ ఫిషింగ్ హార్బర్ రాబోతోందని ప్రచారం జరుగుతుండగా, స్థానికులు దానికోసం ఎదురుచూస్తున్నారన్నారు. అయితే కొత్తగా తాను ఎమ్మెల్యే అయినందున అసలు ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు ప్రక్రియ ఎంతవరకు వచ్చిందో తెలుసుకోవగలుగుతున్నానని కొండయ్య చెప్పారు.