ప్రముఖ సినీ నటుడు అజయ్ ఘోష్ చిన్నగంజాం మండల పరిధిలోని గొనసపూడి గ్రామంలో శుక్రవారం సందడి చేశారు. గొనసపూడి గ్రామానికి చెందిన అంతర్జాతీయ అవార్డు గ్రహీత విక్రం నారాయణరావు ఆధ్వర్యంలో అన్నపూర్ణేశ్వరి నిత్య ఆన్నామృతం పేరు మీద ప్రతిరోజూ జరుగుతున్న అన్నదాన కార్యక్రమాన్ని సందర్శించారు. గ్రామంలో విక్రం నారాయణరావు చేస్తున్న సేవలను కొనియాడారు. ఆయన సేవలకు తగ్గ ఫలితం అంతర్జాతీయ అవార్డు అని అజయ్ ఘోష్ అన్నారు.