చీరాల మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావు పై ఎమ్మెల్యే కొండయ్య ఆధ్వర్యంలోని టీడీపీ, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గీయులైన కౌన్సిలర్లు కలిసి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై బుధవారం ఓటింగ్ జరగనున్న నేపథ్యంలో మంగళవారం క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. ఎవరికి వారే తమ తమ కౌన్సిలర్లను క్యాంపులకు తీసుకెళ్లారు. అవిశ్వాస తీర్మానం సులువుగా నెగ్గనున్నప్పటికీ వైసీపీ కూడా తన ప్రయత్నాలు తాను చేసుకుంటోంది.