పంగులూరు: ఎంపీడీవో కార్యాలయంలో జ్యోతిరావు పూలే జయంతి

60చూసినవారు
పంగులూరు: ఎంపీడీవో కార్యాలయంలో జ్యోతిరావు పూలే జయంతి
సంఘసంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతి వేడుకలు శుక్రవారం పంగులూరులోని ఎంపీడీవో కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఎంపీడీవో స్వరూప రాణి పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే భారత సమాజానికి ఎంతో విలువైన సేవలు అందించాలని కొనియాడారు. అంటరానితనం నిర్మూలనకు, అట్టడుగు ప్రజల అభ్యున్నతి కోసం ఆయన ఎన్నో పోరాటాలు చేశారని చెప్పారు.

సంబంధిత పోస్ట్