పర్చూరు మండలం ఉప్పరపాలెం గ్రామ శివారులోని పొలాల్లో గుట్టు చప్పుడు కాకుండా నడుస్తున్న పేకాట స్థావరంపై పర్చూరు ఎస్సై మాల్యాద్రి ఆదివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో మెరుపు దాడి చేశారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న పలువురిని ఆయన రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారి వద్ద నుండి 52 వేల రూపాయల నగదును స్వాధీనపరుచుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.