పర్చూరు: ట్రాక్టర్ ను ఢీకొన్న కారు.. పలువురికి గాయాలు

81చూసినవారు
మార్టూరు వద్ద జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కట్టెల లోడుతో ఒంగోలు వైపు వెళుతున్న ట్రాక్టర్ ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జయింది. కారులో ప్రయాణిస్తున్న వారికి, ట్రాక్టర్ డ్రైవర్ కు గాయాలు అయ్యాయి. 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను మార్టూరు, చిలకలూరిపేట ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్