పర్చూరులోని గిరిజన సంక్షేమ వసతి గృహాన్ని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమీషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలో చీమలు పట్టిన బెల్లాన్ని గుర్తించి సిబ్బందిని సంజాయిషీ అడిగినా చీమలు పడితే మేమేం చేస్తామని బదులు ఇవ్వడంతో ఆమె అవాక్కయ్యారు. తదుపరి జరిగిన మీడియా సమావేశంలో పద్మావతి మాట్లాడుతూ ఇక్కడ పరిస్థితులు అద్వాన్నంగా ఉన్నాయని ప్రభుత్వానికి నివేదిక అందజేస్తానన్నారు.