విజయవాడలోని ఏ కన్వెన్షన్ హాల్ లో బుధవారం ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి అధ్యక్షతన జరిగిన నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్ ల సమావేశంలో చీరాల ఇన్‌ఛార్జ్, మాజీ శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్ పాల్గొన్నారు. అనంతరం షర్మిలారెడ్డితో పాటు ఆయన రాష్ట్ర గవర్నర్ ను కలిసి జగన్- ఆదానీల మధ్య జరిగిన ముడుపుల వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశించాలని కోరారు. తదుపరి జరిగిన మీడియా సమావేశంలో సోలార్ విద్యుత్ కుంభకోణంపై ఆయన ధ్వజమెత్తారు.