చీరాల మండలం వాడరేవు గ్రామం నందు నాగరాజు అనే వ్యక్తి బుధవారం అక్రమంగా మద్యం అమ్ముతున్నాడని సమాచారంతో దాడి చేసి అతని వద్ద నుంచి 12 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీహరి తెలిపారు. రాబడిన ఉన్నతాధికారుల సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్లు ఆయన చెప్పారు. అక్రమ మద్యం, బెల్ట్ షాపులపై నిఘా వచ్చినట్లు తెలియజేశారు.