చీరాల మండలం ఈపురుపాలెం లో మీసేవ సెంటర్ నందు దొంగతనం జరిగిన సంఘటన శనివారం వెలుగు చూసింది. షాపు తాళాలు పగలగొట్టి 40 వేల రూపాయలు నగదును దొంగలు అపహరించినట్లు షాపు యజమాని సాంబయ్య తెలిపారు. ఈపురుపాలెం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. క్లూస్ టీం వేలిముద్రలను సేకరించారు. దొంగతనం దృశ్యాలు సి సి ఫుటేజ్ లో రికార్డు అయ్యాయి.