గొర్రెల కాపరి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటన చీరాల మండలం కొత్తపాలెంలో మంగళవారం సాయంత్రం వెలుగు చూసింది. మరక యేసయ్య అనే వ్యక్తి గవినివారిపాలెంకి చెందిన నక్కల వెంకట్రావు వద్ద నాలుగు నెలల నుండి జీతానికి గొర్రెల కాపరిగా పని చేస్తున్నాడు. గత 20 రోజులుగా కొత్తపాలెంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. అకస్మాత్తుగా అతను ఒక జీడి చెట్టుకు ఉరేసుకొని కనిపించగా గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.